బీహార్ లో పోలీసులపై తిరగబడిన వరద బాధితులు

64చూసినవారు
బీహార్ లో పోలీసులపై తిరగబడిన వరద బాధితులు
ఇటీవల బిహార్‌ రాష్ట్రాన్నిభారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ డిమాండ్లు నెరవేర్చాలని వరద బాధితులు శుక్రవారం నిరసన చేపట్టారు. ముజఫర్‌పూర్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో ఆందోళనకారులను వెల్లగొట్టేందుకు బీహార్ పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ మేరకు వరద బాధితులు సైతం పోలీసులపై తిరిగబడ్డారు. కర్రలు, రాళ్ళతో ప్రతి దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్