అఫ్గాన్‌లో వరదలు.. 33 మంది మృతి (వీడియో)

582చూసినవారు
అఫ్గానిస్తాన్‌లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. ఇప్పటి వరకు 33 మంది చనిపోయారని ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగ అధికారులు ఆదివారం వెల్లడించారు. దేశంలోని 34 ప్రావిన్సుల్లో దాదాపు 20 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 600 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక ఈ వరదల్లో కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్