హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నారు. గురువారం మనాలీలో కుంభవృష్టిగా వర్షం కురవటంతో అంజనీ మహాదేవ్ కాల్వ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలకు మనాలీ-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీదకు కాల్వలోని భారీ బండరాళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో ఆ మార్గాన్ని మూసివేశారు. నేడు కూడా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.