ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, నాగార్జునసాగర్‌లోనూ ఆశించినంత నీటిమట్టం లేకపోవడంతో గతేడాది కాలంగా ప్రజలు తాగునీటికి భూగర్భజలాలపైనే ఆధారపడ్డారు. దీని వల్ల భూ పొరల్లోని జలాల్లో అత్యధిక ఫ్లోరైడ్ కలవడంతో పలు ప్రాంతాల్లో తిరిగి ఫ్లోరోసిస్ మహమ్మారి మళ్లీ విస్తరించే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.