విజయవాడ దుర్గగుడిలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. FSSAI ప్రమాణాలకు దూరంగా దుర్గగుడి సరుకులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అన్నదానం, ప్రసాదాల, నైవేద్యం తయారీ కేంద్రాల్లో అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. దుర్గమ్మ లడ్డూ తయారీలో వాడే ఆవు నెయ్యి, బెల్లం, శనగలు శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపించారు. దుర్గుగుడి స్టోర్స్ సహా అన్నదానం, ప్రసాదం తయారీ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న వారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.