ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌లతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందులో బాగంగా కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ఆల్కహాల్, కెఫిన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి 7 గంటలలోపే డిన్నర్ చేయాలి. ఆహారంలో ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలి. రోజు 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.