జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి డాక్టర్ బిమల్ ఛజేద్ కొన్ని చిట్కాలు సూచించారు. "ఎక్కువగా పీచుపదార్థాలు ఉండే ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. అల్లం, పసుపు, పుదీనా, వామును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజూ అరగంటైనా నడవాలి. అతిగా తినడం, రాత్రిపూట ఆలస్యంగా తినడం మానుకోవాలి. పైనాపిల్, బొప్పాయి, పెరుగు తినాలి” అని చెప్పారు.