ఏపీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లాలో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అనకాపల్లికి చెందిన దంపతులు కూతురితో కలిసి గంట్యాడ మండలంలోని ఓ గ్రామానికి ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ రవి అనే వ్యక్తి బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మంత్రి సంధ్యారాణి పరామర్శించారు.