రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు: సుప్రీం

78చూసినవారు
రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు: సుప్రీం
హరియాణాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ హరియాణా ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు బహుళ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. రైతులు ఎదుర్కొంటున్న తాత్కాలిక సమస్యలను ఆ కమిటీకి తెలపాలని పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలను కోరింది.

సంబంధిత పోస్ట్