మాజీ మంత్రి కేటీఆర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నేడు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్తానని చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్భందించారు. ఉద్రిక్తతలు చోటు చేసుకుండా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.