బీజేడీ కీలక నేత, ఒడిశా మాజీ మంత్రి అనంత్ దాస్ (85) కన్నుమూశారు. ఆయన కొన్నేళ్లుగా వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భువనేశ్వర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మంత్రి కుటుంబ సభ్యులు తెలిపారు. అనంత్ దాస్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.