ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ హైవేపై బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. రవీంద్ర సాహ్ని భార్య జ్యోతి గర్భిణి. ఆమెను ఆసుపత్రికి రవీంద్ర తీసుకెళ్లాడు. వారితో పాటు మరికొందరు బంధువులు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గర్భిణి జ్యోతి సహా నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.