భారత రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజలకు వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అద్దె ఇళ్లలో నివసించే వారికి ఉచితంగా విద్యుత్, నీరు అందిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజకీయ పార్టీలు ఉచితాలతో ప్రజలను ఆకర్షించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.