ఒక ఏడాది కాలవ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలు తీసుకుంటే, వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ మధ్యలో మీకు ఆర్థిక అత్యవసరం ఏర్పడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ వడ్డీ రేటు ఉండి.. స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.