మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’ త్వరలోనే తెలుగులో రిలీజ్ కానుంది. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలలో నటించారు. మలయాళంలో విడుదలైన రెండు వారాల్లోనే ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు కట్టిపడేసిన ఈ మూవీ ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.