కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైన సరీసృపాలు. ఇవి ఇతర జంతువులను తినేందుకు 180 డిగ్రీల వరకు తమ దవడలను తెరవగలవు. 16 నుంచి 23 అడుగుల వరకు పెరుగుతాయి. ఆడ కొండచిలువలు మగ కొండచిలువ లేకుండానే పిల్లలకు జన్మనిస్తాయి. ఈ ప్రక్రియను పార్థినోజెనిసిస్ అంటారు. ఇవి 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువకాలం జీవించగలవు. ఆవాసం, ఆహారం వంటి అంశాలపై ఆధారపడి కొండచిలువల జీవితకాలం మారుతుంది.