ఈ నెలాఖరులోనే వాట్సాప్‌ గవర్నెన్స్‌: సీఎం చంద్రబాబు

63చూసినవారు
ఈ నెలాఖరులోనే వాట్సాప్‌ గవర్నెన్స్‌: సీఎం చంద్రబాబు
ఈ నెలాఖరులోనే వాట్సాప్‌ గవర్నెన్స్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ‘ఏ పని కావాలన్నా ఒక మెసేజ్‌ పెడితే చాలు. మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పనిలేదు. మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు. ‘బనకచర్లకు నీళ్లు తీసుకురావడం నా జీవితాశయం. సీమ ప్రజల రుణం తీర్చుకోవాలనేదే నా ఆలోచన’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్