పోసాని అరెస్ట్‌పై ఆయన సతీమణి కుసుమలత స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. 'మా ఆయనను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. రాత్రి 8:50 గంటలకు వచ్చి 9:10 గంటలకు తీసుకెళ్లిపోయారు. ఎలాంటి సమయం ఇవ్వలేదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. నలుగురు పోలీసులు చుట్టుముట్టారు. నోటీసులు తీసుకుని గురువారం వస్తామన్నా వదల్లేదు. ఆయన పోన్ లాక్కున్నారు. మా ఆయన తప్పును మాత్రమే తప్పు అని చెప్పారు.. దానికే అరెస్ట్ చేయాలా?’ అని ప్రశ్నించారు.