పోసాని అరెస్ట్‌పై స్పందించిన వైఎస్ జగన్

51చూసినవారు
పోసాని అరెస్ట్‌పై స్పందించిన వైఎస్ జగన్
AP: పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇవాళ పోసాని భార్య కుసుమలతను ఫోన్‌లో జగన్ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘దేవుడు అంతా చూస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు" అని జగన్ అన్నారు.

సంబంధిత పోస్ట్