AP: అడవులను రక్షించేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆదివారం గుంటూరులోని అరణ్య భవన్ లో అటవీ అమరవీరుల సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను మర్చిపోకూడదన్నారు. వివిధ వర్గాల నుంచి విరాళాలను సేకరించి రూ.5 కోట్లను ఈ శాఖకు అందజేస్తామని వెల్లడించారు. అటవీశాఖలో తీవ్ర సిబ్బంది కొరత ఉందని తెలిపారు.