ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌లోనూ సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. అదే సమయంలో మహిళల పథకాలపైన క్లారిటీ ఇవ్వనున్నారు. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ లో ఈ మేరకు నిధుల కేటాయిస్తూ ఈ పథకం అమలుపై స్పష్టత ఇస్తారని సమాచారం.