చనిపోయిన వారు.. బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసరార్ధులకు అమర్చడం ద్వారా వారికి పునర్జన్మను ఇచ్చే జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా అవయవ దాతల అంతిమ సంస్కారాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. అవయవ దాతల కుటుంబాలకు రూ.10వేల పారితోషికం, పూలు, శాలువా, ప్రశంసా పత్రం అందించనుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 90వేల మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని ఇటీవల ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తెలిపారు.