కొందరు మహిళలు చేసే పనులు ఫన్నీగా ఉంటాయి. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అంతా అవాక్కయ్యే పనులు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ మహిళ తన ఇంటి మేడ పైన వడియాలు ఆరబెట్టింది. అయితే కాకులు, కోతులు బెడద ఉందో ఏమో గానీ ఇంట్లోని పులి బొమ్మను వడియాలకు కాపలాగా పెట్టింది. ఇది వైరల్ కావడంతో దీనిని చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.