గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన 1949లో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. గద్దర్ తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న గద్దర్.. ఊరురా తిరిగి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథ ప్రదర్శన ఎంచుకున్నారు.