నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నియోజకవర్గ నాయకులు శుక్రవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా వారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. ముఖ్యంగా కొత్త పరిశ్రమలు, విద్య, వైద్యం, వ్యవసాయం, త్రాగునీరు, సాగునీటి రంగాలలో అచ్చంపేట నియోజకవర్గాన్నిఅభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది.