రేపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి

592చూసినవారు
రేపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి
యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ లు సురభి, రమేష్ బాబు, జిల్లా డీసీసీ అధ్యక్షులు డా. వంశీకృష్ణ ఆదేశానుసారం రేపు సోమవారం ఉదయం 10 గంటలకు అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపినిస్తున్నట్లు యూత్ తాలూకా అధ్యక్షులు బద్దుల అజయ్ యాదవ్ ఆదివారం తెలిపారు. రాష్ట్రం లో టీఎస్పీఎస్సీ, 10వ తరగతి పేపర్స్ లీక్స్ జరిగినా అధికార ఎమ్మెల్యేలు స్పందించకుండా అంటిముట్టనట్లుగా వ్యహరించడనికి నిరసిస్తూ ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. అసమర్ధ రాష్ట్రం ప్రభుత్వం వల్ల ఎంతో మంది విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలు నాశనం అయ్యాయని వాపోయారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల క్యాంప్ ఆఫీసులను ముట్టడించి ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రగతి భవన్, గడీల పాలనకు చరమ గీతం పలకాలని కోరారు. ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగులు, తాలుకా యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల కమిటీ సభ్యులు, యూత్ గ్రామ అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్