లీకేజీతో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు

4250చూసినవారు
లీకేజీతో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు
గత రెండు రోజులుగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో నీరు వృధాగా పోతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయింది. ఈ పైప్ లైన్ నుండే గ్రామ శివారులో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ లోకి నీరు సరఫరా అవుతుంది. లికేజితో గత రెండు రోజులుగా నీరు వృధాగా పోతున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. అసలే ఎండాకాలంతో ఒక పక్క భూగర్భజలాలు అడుగంటి పోతుంటే మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని మాత్రం వృధాగా వదిలేస్తూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లీకైన మిషన్ భగీరథ పైప్ లైన్ కి వెంటనే మరమ్మతులు చేపట్టి నీరు వృధాగా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్