తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ప్రమోషన్ లు బదిలీల ద్వారా ఏర్పడే ఖాళీలను ప్రస్తుత డిఎస్సీ లోనే కలపాలని సోమవారం అచ్చంపేట పట్టణంలోని శ్రీసాయి స్టడీ హాల్ దగ్గర డిఎస్సీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఖాళీలన్నింటిని కలిపి మెగా డిఎస్సీ ప్రకటించాలని నిరసన కార్యక్రమంలో కోరారు.