దొంగతనాన్ని కేవలం నాలుగు గంటల్లోనే చేదించిన పోలీస్ లు

2968చూసినవారు
దొంగతనాన్ని కేవలం నాలుగు గంటల్లోనే చేదించిన పోలీస్ లు
టీచర్స్ కాలనీలో మహిళా మేడలోని గొలుసును దొంగతనం చేసిన వ్యక్తి ని అచ్చంపేట్ టౌన్ పోలీస్ లు కేవలం 4 గంటల్లోనే చేదించడం అభీనందనీయమని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే, గువ్వల బాలరాజు అన్నారు. గురువారం రాత్రి టీచర్స్ కాలనీలోని బాధిత మహిళను పరామర్శించి సంఘటన జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా బాధిత మహిళలకు ప్రభుత్వం తరఫున వైద్య సహాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంటనే కాలనీవాసులతో సమావేశాన్ని నిర్వహించి ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అన్నివేళలా ప్రభుత్వము, పోలీస్ శాఖ తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు.

అలాగే నేను చెడును పోషించేవాడని కాదన్నారు. మనం ఎన్నికయింది కేవలం ప్రజాసేవ కొరకే ప్రజా శ్రేయస్సు కొరకే అని, మీకు అన్ని విధాల అన్నివేళలా ఎల్లప్పుడూ సహాయంగా ఉంటానని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించి సత్కారం చేయడం జరిగింది. అదేవిదంగా ప్రభుత్వం నుంచి అచ్చంపేట కొరకు ప్రత్యేకంగా ఎస్డిఎఫ్ నిధులను కేటాయించడం జరుగుతుంధన్నారు. అచ్చంపేట టౌన్ లో ఎక్కువగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయవలసిందింగా అధికారులను ఆదేశించారు. దొంగలని పట్టుకోవడానికి ఉత్సాహం చూపించినటువంటి పిల్లలకు ప్రభుత్వ విప్ నగదును బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బలుస అరుణ, అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, అచ్చంపేట సీఐ అనుదీప్, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్