Sep 30, 2024, 10:09 IST/
సీఎం ఆతిశీ, కేజ్రీవాల్‌లకు ‘సుప్రీం’లో ఊరట
Sep 30, 2024, 10:09 IST
పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం ఆతిశీ, మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ వారు చేసిన విజ్ఞప్తిపై ఢిల్లీ ప్రభుత్వానికి, బీజేపీ నేత రాజీవ్ బబ్బర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.