AP: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి భక్తులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల కోసం ప్రత్యేక యాప్ లాంఛ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి భవానీ భక్తులు మాల విరమణ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి వస్తున్నారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం యాప్ తీసుకొచ్చామన్నారు.