తెలంగాణ ప్రజల మెగా హెల్త్ ప్రొఫైల్‌గా కులగణన: సీఎం

68చూసినవారు
తెలంగాణ ప్రజల మెగా హెల్త్ ప్రొఫైల్‌గా కులగణన: సీఎం
తెలంగాణ ప్రజల మెగా హెల్త్ ప్రొఫైల్‌గా కులగణన మారుతుందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్మించిన కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ - దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ కురుమ భవనానికి సీఎం ప్రారంభించి మాట్లాడారు. రజాకార్లను గ్రామాల్లోకి రాకుండా, దొరల పెత్తనాన్ని అడ్డుకున్న గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్