అయిజ: ఘనంగా ప్రారంభమైన దీపావళి సంబరాలు

58చూసినవారు
అయిజ మండలంలో చినజీయర్ స్వామి ఆశ్రమంలో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామనగరంలోని సమతామూర్తి ప్రాంగణంలో గురువారం నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 30 అడుగుల భారీ నరకాసుర ప్రతిమను ఏర్పాటుచేసి దానిని దహనం చేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. నరకాసురుడు దుష్ట గుణాలకు ప్రతీక అని, ప్రజలంతా దుర్గుణాలను వదిలి సత్ బుద్ధి కలగాలనే నరకాసుర వధ చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్