జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో ఉగాది పండగ సందర్బంగా 1వ సిపిల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అథితులుగా అయిజ ఎస్సై పీ శ్రీనివాసులు, ట్రైనింగ్ ఎస్సై కిరణ్ కుమార్, అయిజ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ నాయుడు హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడలు మనిషి ఆరోగ్యంగా మానసికంగా ఎదగడానికి ఎంతోగానో ఉపయోగపడతాయని ఎస్సై అన్నారు.