‘వారు నన్ను చంపవచ్చు, కానీ నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని నలిపివేయగలరు.. కానీ నా ఆత్మను నలిపివేయలేరు’ అంటూ.. బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన యువ కెరటం భగత్‌సింగ్. 23 ఏళ్లకే దేశ దాస్యవిముక్తి కోసం నవ్వుతూ ఉరితాడును ముద్దాడారు. 1931, మార్చి 23 రాత్రి 7.30 గంటలకు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీశారు. వారి త్యాగం నేటి యువతకు ఆదర్శం. ఏటా ఈ రోజును దేశంలో 'అమరవీరుల దినోత్సవం'గా జరుపుకుంటారు.