1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతంతో భగత్‌సింగ్‌లో బ్రిటిష్‌వారి పట్ల ఆగ్రహం పెల్లుబికింది. మహాత్మాగాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులో 9వ తరగతికి స్వస్తి చెప్పి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. లాహోర్‌లోని నేషనల్ కాలేజీ భగత్ జీవితాన్ని మరింతగా మార్చేసింది. ఆ కళాశాల అధ్యాపకుడు జయచంద్ర విద్యాలంకార్ విద్యార్థుల్లో విప్లవ బీజాలు నాటాడు. ఆ సమయంలోనే రష్యా విప్లవ సాహిత్యాన్నీ అధ్యయనం చేశాడు. అది ఆయన జీవితాన్ని మార్చివేసింది.