భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్‌లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో 1907, సెప్టెంబరు 28న కిషన్‌సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించారు. భగత్ సింగ్ తాత అర్జున్‌సింగ్.. స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. ఆయన ప్రభావం భగత్‌పై ఎక్కువగా ఉండేది. అదీగాక భగత్ కుటుంబం దేశభక్తికీ, సాహసానికీ పెట్టింది పేరు.