భగత్‌సింగ్ అరెస్ట్ వార్త నాడు దేశాన్ని కుదిపేసింది. క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించడం ద్వారా ఉరిశిక్షను ఆపవచ్చని నాటి కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే క్షమాభిక్షను భగత్ సింగ్ వ్యతిరేకించారు. అసలు క్షమాభిక్షను పిరికివారి చర్యగా అభివర్ణించారు. క్షమాభిక్ష కోసం ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి జైలు నుంచి బయటకు వచ్చిన నకిలీ దేశభక్తులు కొందరైతే.. క్షమాభిక్ష అవకాశమున్నా తిరస్కరించి, ఉరి కొయ్యను ముద్దాడిన యోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్.