లాహోర్‌లో లాలా లజపతిరాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. సూపరింటెండెంట్ సాండర్స్ చేతిలో పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ నేలకొరిగాడు. ఆయన మరణం భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులలో ఆగ్రహాన్ని నింపింది. ఆ తర్వాత సాండర్స్‌ను కసితీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత 1929లో పార్లమెంటుపై బాంబులు విసిరారు. తప్పించుకునే అవకాశమున్నా వారు లొంగిపోయారు.