వాగులు, వంకల పట్ల అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై విజయ భాస్కర్

61చూసినవారు
వాగులు, వంకల పట్ల అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై విజయ భాస్కర్
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐజ ఎస్సై విజయ్ భాస్కర్ గురువారం సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లోని వాహనదారులు వాగు ప్రవాహం తగ్గిన తర్వాత మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు. మట్టి మిద్దెలలో నివసించే వారు తగిన జాగ్రత్తలు తీసుకుని, కుటుంబాలను సురక్షితంగా కాపాడుకోవాలని హితవు పలికారు. అలాగే, పొలాల్లో పని చేసే రైతులు పిడుగుపాటు ప్రమాదాన్ని తప్పించుకునేందుకు చెట్ల కింద ఆశ్రయం తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్