ఇటీవల సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 57 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు పాల్గొని, బాధితులకు ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ పోయిన వెంటనే ఆందోళన చెందకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో లేదా సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.