అలంపూర్ నియోజకవర్గలోని ఉండవెల్లి మండలంలోని పుల్లూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆంజనేయులు కుమారుడు నాగశేషులు శుక్రవారం మరణించారు. విషయం తెలిసిన వెంటనే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.