మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివేన గ్రామానికి చెందిన చిక్కొండ్ర బాలస్వామి చిక్కొండ్ర ఇందిరా దంపతుల కుమారుడు చిక్కొండ్ర సతీష్ యాదవ్ ఇటీవల వెలువడిన ఆర్మీ ఫలితాలలో ఉద్యోగాన్ని సాధించాడు. చిన్న వయసులో ఉద్యోగాన్ని సాధించడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్మీ పై ఉన్న అభిమానంతో ఉద్యోగాన్ని సాధించానని సతీష్ తెలిపాడు.