హైదరాబాద్ ఓఆర్ఆర్ టోలేట్ లీజ్ ఫై విచారణ జరపాలని సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 27, 2023న అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఐఆర్బి సంస్థకు 30ఏళ్లకు లీజుకు ఇచ్చిందన్నారు. అందుకు ఐఆర్బి సంస్థ ప్రతిగా ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చిందని, క్విడ్ ప్రోకో జరిగిందని కేటిఆర్ పాత్ర ఉందని ఆరోపించారు.