దేవరకద్ర నియోజవర్గం భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ఎద్దుల బండ్లు ప్రదర్శించడం జరిగింది . ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పద్మ జక్కి రెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో ప్రతి సంక్రాంతి పండగకి దేవాలయం చుట్టూ ఎడ్లబండ్ల తిరగడం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. పూర్వం నుండి ఈ పండగగా ఇలాగే నిర్వహిస్తామని దాదాపు 40 ఎద్దుల బండ్లు 20 ట్రాక్టర్లు 10 ఆటోలు దేవాలయం చుట్టూ తిరగడం జరిగిందని గ్రామ సర్పంచ్ పద్మ జక్కి రెడ్డి తెలియజేశారు. ఈ సంబరాల్లో రైతులు గ్రామ పెద్దలు అలాగే యువకులు తదితరలు పాల్గొన్నారు.