ధరూర్: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సతీమణి
గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన శేఖర్ ఇటీవలే మరణించారు. అదేవిధంగా రాముడు కుమార్తె కూడా ఇటీవలే మరణించారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు. ఎమ్మెల్యే సతీమణి వెంట నాయకులు శ్రీరాములు, విజయ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.