మార్లబీడు పాఠశాల వద్ద మద్యం సీసాలు, గుట్కా సంచులు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం మార్లబీడు గ్రామంలో పాఠశాల ప్రధాన ద్వారం ముందు మద్యం సీసాలు, గుట్కా సంచులు వదిలివేయడం వల్ల పిల్లలు వాటిని చూడటం ద్వారా భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ గేట్ వద్ద ఈ రకమైన నిషిద్ధ పదార్థాలు వదిలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.