గట్టు: మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పరిధిలోని ఆరగిద్ద, గోర్లఖాన్ దొడ్డి గ్రామాలలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో మొబైల్ యాప్ ద్వారా మహిళలు పెద్ద ఎత్తున సభ్యత్వం పొందారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎం. నర్సింహులు, మాజీ ఎంపీటీసీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.