సాతర్ల గ్రామంలో పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో బీజేపీ మండలం అధ్యక్షుడు అబ్దుల్లా ఆధ్వర్యంలో పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు బుదవారం జరిపారు. పండిత్ దీనదయాల్ సంగ్ పరివార్ కార్యకర్తగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంగ్ పార్టీలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ‘అంత్యోదయ’ సిద్ధాంతంతో, ప్రతి పేద వ్యక్తికి, చిట్టచివరి వ్యక్తికి పథకాలు అందాలి అనే ఆశయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు.