మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై బస్సు లారీ ఢీకొన్న ప్రమాదం తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామానికి చెందిన రాజు ఉర్స్ (55) మృతి చెందగా మరొకరు హైదరాబాద్ లో మేస్త్రీ పని చేస్తూ తన స్వగ్రామానికి వెళ్తున్న నూరు హైమద్ (58) గా గుర్తించారు. కాగా మరో ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు శనివారం సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది.